జమ్మూ-కశ్మీర్‌లో ‘బయటి ఓటర్లు’ వద్దు!

జమ్మూ-కశ్మీర్‌లో సాధారణ నివాసం ఉంటున్న బయట వ్యక్తులు ఓటర్లుగా నమోదు కావొచ్చని ఎన్నికల అధికారి పేర్కొనడంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) తదితర

Published : 19 Aug 2022 05:15 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో సాధారణ నివాసం ఉంటున్న బయట వ్యక్తులు ఓటర్లుగా నమోదు కావొచ్చని ఎన్నికల అధికారి పేర్కొనడంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) తదితర పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై చర్చించేందుకు ఈనెల 22న శ్రీనగర్‌లోని తన నివాసంలో అఖిలపక్ష సమావేశానికి ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా పిలుపునిచ్చారు. జమ్మూ-కశ్మీర్‌ పరిధిలో భాజపా మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలనూ ఆయన సమావేశానికి ఆహ్వానించినట్లు ఎన్‌సీ అధికార ప్రతినిధి ఇమ్రాన్‌ నబీ దార్‌ తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌లో బయటవారితో సహా 25 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాల్లో చేరే అవకాశం ఉందని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి (సీఈవో) హిర్దేశ్‌ కుమార్‌ బుధవారం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని