ప్రధాని పీఠంపై ఆశతో నీతీశ్‌ వెన్నుపోటు

ప్రధాని పీఠంపై ఆశతో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో కలిసి భాజపాకు వెన్నుపోటు పొడిచారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. బిహార్‌లో కమలదళం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దూరమయ్యాక అమిత్‌షా తొలిసారి

Published : 24 Sep 2022 05:29 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధ్వజం

పూర్ణియా: ప్రధాని పీఠంపై ఆశతో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో కలిసి భాజపాకు వెన్నుపోటు పొడిచారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. బిహార్‌లో కమలదళం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దూరమయ్యాక అమిత్‌షా తొలిసారి శుక్రవారం రాష్ట్రంలో పర్యటించారు. పూర్ణియాలో పార్టీ ర్యాలీ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. నీతీశ్‌కు నిర్దుష్ట భావజాలం లేదని, కుల రాజకీయాలకు సోషలిజాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. కూటములు మార్చుతూ ప్రధాని కాగలరా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి నీతీశ్‌ చాలామందికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ‘లాలూజీ.. మీరూ జాగ్రత్తగా ఉండండి. నీతీశ్‌ రేపు మిమ్మల్నీ వెనక్కినెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహాఘట్‌బంధన్‌ సర్కార్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి భయాందోళన వాతావరణం ఏర్పడింది. విభేదాలు సృష్టించడానికి నేను వస్తున్నానని లాలూ, నీతీశ్‌ అంటున్నారు. అంత అవసరం నాకు లేదు. అందుకు మీరున్నారు కదా! మీ ప్రభుత్వం వచ్చాక భయపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే వచ్చా..’ అని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నీతీశ్‌ ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాలూప్రసాద్‌, నీతీశ్‌లను బిహార్‌ ప్రజలు చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని