కాంట్రాక్టుల పంపకాల్లో మూడు పార్టీల నేతలూ ఒక్కటే

రాష్ట్రంలో కాంట్రాక్టులు పంచుకునే విషయంలో తెరాస, భాజపా, కాంగ్రెస్‌ నాయకులు ఒక్కటవుతారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో బహుజన

Published : 25 Sep 2022 04:59 IST

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంట్రాక్టులు పంచుకునే విషయంలో తెరాస, భాజపా, కాంగ్రెస్‌ నాయకులు ఒక్కటవుతారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర శనివారం మూడో రోజు కొనసాగింది. పలు గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గర్భిణులకు, పిల్లలకు పంచే పౌష్టికాహార కిట్ల పంపిణీ టెండర్లలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడి కమీషన్లు దండుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి, తెరాస ఒక్కటేనని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనూ రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టు దక్కిందని ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాల జీవితాలు బాగుపడాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. యాత్రలో భాగంగా జైకేసారంలో శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికుడు యాదయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఎస్‌.లింగోటంలో జీతాలు, ఇతర డిమాండ్ల సాధన కోసం ప్రతిష్ఠ పెస్టిసైడ్స్‌ పరిశ్రమ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని