వైకాపా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుంది

ఎన్నికలున్నా.. లేకపోయినా వైకాపా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందని శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకరుగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆదివారం ఆయన విజయనగరం చేరుకున్నారు.

Published : 26 Sep 2022 04:49 IST

ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం పట్టణం/గ్రామీణం/వుడాకాలనీ: ఎన్నికలున్నా.. లేకపోయినా వైకాపా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందని శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకరుగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆదివారం ఆయన విజయనగరం చేరుకున్నారు. వైకాపా కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించారు. 4 గంటలకు పైగా ర్యాలీ సాగింది. విచిత్ర వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, నెల్లిమర్ల శాసనసభ్యుడు బడుకొండ అప్పల నాయుడు, శాసన మండలి సభ్యులు పీవీ సూర్యనారాయణ, ఇందుకూరి రఘురాజు తదితరులు కోలగట్లకు అభినందనలు తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం, కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలక వర్గం, నగర పాలక సంస్థ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ సభ్యులు క్రేన్‌ సాయంతో గజమాలను వేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని