జగన్‌ ఆర్థిక విధానాలతో పుట్టబోయే బిడ్డల మీదా అప్పుల భారం

రాష్ట్రంలో జగన్‌రెడ్డి అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పుట్టబోయే బిడ్డల మీదా రూ.70వేల నుంచి 80వేల వరకు అప్పుల భారం పడనుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ ధ్వజమెత్తారు.

Published : 26 Sep 2022 05:15 IST

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో జగన్‌రెడ్డి అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పుట్టబోయే బిడ్డల మీదా రూ.70వేల నుంచి 80వేల వరకు అప్పుల భారం పడనుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ ధ్వజమెత్తారు. గతంలో సామాన్యుడు రూ.300 సంపాదిస్తే అందులో రూ.వంద దాచుకోలిగారని, నేడు రూ.వెయ్యి సంపాదించినా రూపాయి కూడా దాచుకోలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తప్పుడు లెక్కలతో జగన్‌, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రజలను మభ్యపెడుతున్నారు. కేవలం రోజువారీ ఖర్చుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు అప్పులు చేస్తోందని కాగ్‌ ఆక్షేపించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రం తిరోగమనంవైపు వెళుతోందని స్పష్టంగా అర్థమవుతుంది. కరోనాతో ఆక్వా, చేపల ఎగుమతులు పూర్తిగా దెబ్బతిని ఆ రంగంలోని రైతులు తీవ్రంగా నష్టపోతే... బుగ్గన 40 శాతం వృద్ధి సాధించినట్లుగా అసత్యాలు చెబుతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకు పూటగడవని పరిస్థితి నెలకొంది.  రెండు వేల మందికి ఉపాధి కల్పించగలిగే ఒక్క పరిశ్రమనూ తేలేని ప్రభుత్వం.. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’ బిజినెస్‌లో మొదటి స్థానంలో ఎలా ఉంటుంది’ అని నసీర్‌ అహ్మద్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని