పారిశ్రామికవేత్తలు ఎగవేస్తే మాఫీ.. రైతులు చెల్లించకపోతే జైలా

రైతులు రుణాలను చెల్లించకపోతే ఎగవేతదారుడని ముద్ర వేస్తున్నారని, అదే ధనిక పారిశ్రామికవేత్తలకైతే మాఫీలు చేస్తున్నారని.. ఈ అసమానతలకు వ్యతిరేకంగానే కాంగ్రెస్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ

Published : 27 Sep 2022 05:54 IST

 ఈ అన్యాయానికి వ్యతిరేకంగానే భారత్‌ జోడో యాత్ర: రాహుల్‌గాంధీ

పాలక్కడ్‌ (కేరళ): రైతులు రుణాలను చెల్లించకపోతే ఎగవేతదారుడని ముద్ర వేస్తున్నారని, అదే ధనిక పారిశ్రామికవేత్తలకైతే మాఫీలు చేస్తున్నారని.. ఈ అసమానతలకు వ్యతిరేకంగానే కాంగ్రెస్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ‘భారత్‌ జోడో యాత్ర’లో  భాగంగా ఆయన సోమవారం, 19వ రోజు.. కొప్పంలో జరిగిన భారీసభలో మాట్లాడారు. దేశంలో డబ్బు మాయమవ్వడం లేదని, అది కొద్దిమంది ధనిక వ్యాపారవేత్తల జేబుల్లోకి చేరుతోందని తెలిపారు.

‘‘బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న భారీ రుణాలను మాఫీ చేస్తున్నారు. రైతు తాను తీసుకున్న చిన్న రుణం చెల్లించకపోయినా జైల్లో పెట్టి.. ఎగవేతదారుడనే ముద్ర వేస్తున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగానే భారత్‌ జోడో యాత్ర. రాజు చెబుతున్న  ఈ ‘రెండు భారత్‌’లను దేశం అంగీకరించదు’’ అని హిందీలో రాహుల్‌ ట్వీటు కూడా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని