ఉత్తరాంధ్రను దోచుకోవడానికే రాజధాని నాటకం: బీవీ రాఘవులు

ఉత్తరాంధ్ర సంపదను దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం విశాఖను రాజధానిగా ప్రకటించిందని సీపీఎం పొలిటబ్యూరో సభ్యుడు బీవీ

Published : 28 Sep 2022 04:26 IST

విజయనగరం మయూరి కూడలి, విశాఖపట్నం(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర సంపదను దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం విశాఖను రాజధానిగా ప్రకటించిందని సీపీఎం పొలిటబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఉత్తరాంధ్రపై ప్రేమే ఉంటే స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా చూడాలన్నారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎం జగన్‌కు ఏ మాత్రం స్పృహ లేదని మండిపడ్డారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో విజయనగరం, విశాఖలో నిర్వహించిన ‘దేశరక్షణ భేరి’ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా చెప్పుకొంటున్నారని, అసలు కథంతా మోదీ నడిపిస్తున్నారనే విషయం ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్ర అధికార, ప్రతిపక్ష నాయకులకు కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ఉండాలని కోరుకున్న ఏకైక పార్టీ భాజపా అని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం, వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని