‘గడప గడపకూ’ వెళ్లని వారికి చివరి హెచ్చరిక?

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో బుధవారం ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సమావేశమవనున్నారు. ఈ

Updated : 28 Sep 2022 06:00 IST

నేడు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

ఈనాడు, అమరావతి: ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో బుధవారం ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సమావేశమవనున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికీ సరిగ్గా తిరగని ఎమ్మెల్యేలకు ఈ సమావేశంలో సీఎం చివరి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఆయన కార్యాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గత వారమే ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్న పలువురు ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు. మరోవైపు గత సమావేశం నాటికి అసలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించని ఎమ్మెల్యేలను జగన్‌ గట్టిగానే హెచ్చరించడంతో తర్వాత నుంచి వారు గడప గడపకూ వెళ్లడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ మేర తిరిగారనే అంశంపై బుధవారం సమీక్షించడంతోపాటు, వారి పనితీరుపై వచ్చిన సర్వే పైనా సీఎం చర్చించనున్నట్లు తెలిసింది. 175  నియోజకవర్గాలకూ పార్టీ పర్యవేక్షకుల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని