TRS: తెరాస కీలక నిర్ణయం.. కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటనలకు సొంత విమానం!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెరాస గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెర్డ్‌   ఫ్లైట్‌(చిన్న విమానం) కొనుగోలు  

Updated : 30 Sep 2022 08:41 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెరాస గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెర్డ్‌   ఫ్లైట్‌(చిన్న విమానం) కొనుగోలు  చేయనుంది. ఇందుకోసం రూ.80 కోట్లను వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. 12 సీట్లతో కూడిన ఈ విమానం కొనుగోలుకు సంబంధించి దసరా పర్వదినాన ఆర్డర్‌ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది.

దసరా రోజున (అక్టోబర్‌ 5) కొత్త పార్టీ పేరు ప్రకటన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు పార్టీ నుంచి ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ ఖజానాలో ఇప్పటికే రూ.865 కోట్ల మేర నిధులున్నా.. విమానం కొనుగోలుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల పర్యటనలకు ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకొని వినియోగిస్తున్నారు.

జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సొంత విమానం అవసరమనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. 2001లో తెరాసను ప్రారంభించాక.. హెలికాప్టర్‌ను వినియోగించడం పార్టీ బలోపేతానికి దోహదం చేసిందని.. దాని ద్వారా గుర్తింపు వచ్చిందని.. ఇప్పుడు సొంత విమానం వాడడం ద్వారా జాతీయస్థాయిలో అంతే గుర్తింపు వస్తుందని ఆయన పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని