పాపాల పరిహారం కోసమే యాదాద్రికి కేసీఆర్‌ కానుకలు: పొన్నాల

చేసిన పాపాల పరిహారం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి స్వామికి కానుకలు ఇస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. చేసిన దోపిడీతో జాతీయ పార్టీ పెడతానని దేవుడికి మొక్కితే వరం ఇస్తాడా? అని ప్రశ్నించారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుంది ముఖ్యమంత్రి తీరు అని ఎద్దేవా చేశారు.

Published : 01 Oct 2022 06:22 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: చేసిన పాపాల పరిహారం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి స్వామికి కానుకలు ఇస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. చేసిన దోపిడీతో జాతీయ పార్టీ పెడతానని దేవుడికి మొక్కితే వరం ఇస్తాడా? అని ప్రశ్నించారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుంది ముఖ్యమంత్రి తీరు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ శుక్రవారం నాటి యాదాద్రి, శనివారం చేపట్టబోయే వరంగల్‌ పర్యటనల నేపథ్యంలో పొన్నాల శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో కేసీఆర్‌ చేసినంత దోపిడీ ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు. జాతీయ పార్టీ పేరుతో సొంత విమానం కొనడం ఆయన దోపిడీకి నిదర్శనమన్నారు. వరంగల్‌ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్‌ గత 8 సంవత్సరాలుగా ఆ జిల్లాకు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts