నా ఓటు భాజపాకే!

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇటీవల తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మీడియా దృష్టిని ఆకర్షించిన ఆటో డ్రైవర్‌ విక్రమ్‌ దంతాని శుక్రవారం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. త్వరలో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు భాజపాకేనని తెలిపారు.

Published : 01 Oct 2022 09:34 IST

కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిన ఆటో డ్రైవర్‌ వెల్లడి
అతిథిగానే ఆయనను పిలిచానన్న అహ్మదాబాద్‌ వాసి

అహ్మదాబాద్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇటీవల తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మీడియా దృష్టిని ఆకర్షించిన ఆటో డ్రైవర్‌ విక్రమ్‌ దంతాని శుక్రవారం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. త్వరలో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు భాజపాకేనని తెలిపారు. అసలు ఎప్పటి నుంచో భాజపా అభిమానినని చెప్పారు. సెప్టెంబరు 12న అహ్మదాబాద్‌లో ఆప్‌ నిర్వహించిన సమావేశానికి తోటి ఆటో డ్రైవర్లతో కలిసి విక్రమ్‌ హాజరయ్యారు. కేజ్రీవాల్‌కు వీరాభిమానినని పేర్కొంటూ ఆయనను తన ఇంటికి రావాలని కోరడం, అందుకు దిల్లీ సీఎం అంగీకరించడం అప్పుడు సంచలనమైంది. అయితే, విక్రమ్‌ శుక్రవారం అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. భాజపా బ్యాడ్జీ ధరించిన విక్రమ్‌ను ఇదే విషయమై ప్రశ్నించగా...ఒక అతిథిగానే కేజ్రీవాల్‌ను తన ఇంటికి ఆహ్వానించానన్నారు. తమకు ఏ అవసరం వచ్చినా ఆదుకునేది భాజపా కార్యకర్తలేనని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం ఇప్పటి వరకూ ఆప్‌ నాయకులెవరూ తమను కలవలేదని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts