Gangula Kamalakar: కేసీఆర్‌, హరీశ్‌లను విడదీయాలనే మీ కుట్రలు ఫలించవు: మంత్రి గంగుల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడి ప్రభుత్వానికి సలహాలివ్వాలే తప్ప తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు.

Updated : 02 Oct 2022 07:20 IST

ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణలో చిచ్చు పెట్టకండి: మంత్రి గంగుల

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడి ప్రభుత్వానికి సలహాలివ్వాలే తప్ప తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులను విడదీసేలా ఏపీ మంత్రులు అమర్‌నాథ్‌, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డిలు చేస్తున్న ప్రకటనలను ఖండిస్తున్నా. తెరాస ఒక కుటుంబం. దానికి కేసీఆర్‌ తండ్రిలాంటి వారు. ఇలాంటి కుటుంబంలో ఒకరిని వేరుచేసే కుట్రలు ఫలించవు. ఏపీలో అక్కడి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ కుటుంబంపై కుట్రలకు దిగారు. వైకాపా భాజపా బీ టీంలా పనిచేస్తోంది.  సజ్జల జగన్‌ కుటుంబంలో చేరి తల్లిని, కొడుకుని.. అన్నని, చెల్లిని విడదీసినట్లుగా తెలంగాణలో చేస్తామంటే కుదరదు’’ అని గంగుల హెచ్చరించారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం ఏపీలో పాగా వేస్తామన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts