జగనన్న గోరుముద్దలో అక్రమాలు: వైకాపా ఎమ్మెల్యే

జగనన్న గోరుముద్ద పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడంలేదని వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 23 Nov 2022 07:27 IST

విడవలూరు, న్యూస్‌టుడే: జగనన్న గోరుముద్ద పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడంలేదని వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్లలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న గోరు ముద్ద పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల వేగూరు జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా 150 మంది విద్యార్థులకు 115 కోడిగుడ్లు, లేగుంటపాడులో 150 మంది విద్యార్థులకు 60 కోడిగుడ్లే వండారని తెలిపారు. మిగిలిన కోడిగుడ్లు ఏమయ్యాయని నిర్వాహకులను అడిగితే సరైన సమాధానం చెప్పలేదని, వారిని బాధ్యతల నుంచి తొలగించామని చెప్పారు. ప్రత్యేక నిఘా ఉంచి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు