YSRCP: ఇది మనందరి ఖర్మ!.. వైకాపా ప్రజాప్రతినిధుల ఆవేదన

‘గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మించుకుందామన్నా నిధులు లేవు. గతంలో తీర్మానించిన పనులకూ అతీగతీ లేదు. ఇలాగైతే ఈ సమావేశాలకు విలువ ఎలా ఉంటుంది? ఇది అందరు సర్పంచులు అనుభవిస్తున్న ఖర్మ.. దీనిపై తీర్మానించి అందరూ సంతకాలు పెడితే పైకి పంపిద్దాం’ అని వైకాపాకు చెందిన జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 25 Nov 2022 09:14 IST

జి.సిగడాం, న్యూస్‌టుడే: ‘గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మించుకుందామన్నా నిధులు లేవు. గతంలో తీర్మానించిన పనులకూ అతీగతీ లేదు. ఇలాగైతే ఈ సమావేశాలకు విలువ ఎలా ఉంటుంది? ఇది అందరు సర్పంచులు అనుభవిస్తున్న ఖర్మ.. దీనిపై తీర్మానించి అందరూ సంతకాలు పెడితే పైకి పంపిద్దాం’ అని వైకాపాకు చెందిన జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. గతంలో తీర్మానించిన పనులూ జరగడం లేదని వాపోయారు. ప్రతినెలా సమావేశాలు నిర్వహించడమే తప్ప ప్రయోజనం లేదని అన్నారు. చాలామంది గైర్హాజరు కావడానికి ఇదే కారణమని వాపోయారు. సమావేశంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు పీలు సాధ్విమణి, వెంకటరమణ, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని