న్యాయస్థానాల తీర్పును నాయకులు వక్రీకరిస్తున్నారు: లోక్‌సత్తా

రాజధాని అమరావతి విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఒక విషయాన్ని చెబితే నాయకులు, మంత్రులు దానికి వక్రభాష్యం చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు.

Published : 01 Dec 2022 04:33 IST

సీతంపేట, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఒక విషయాన్ని చెబితే నాయకులు, మంత్రులు దానికి వక్రభాష్యం చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. విశాఖలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తుండగా వాటి ప్రస్తావన లేకుండా కేవలం రాజధాని విషయం జపిస్తూ అభివృద్ధి, పాలనను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, ఇద్దరు సీనియర్‌, మరో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదని ఆరోపించారు. చక్కెర కర్మాగారాలతోపాటు పలు పరిశ్రమలు మూతపడ్డాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సుమారు రూ.100 కోట్లు తీసుకురాలేరా అని ప్రశ్నించారు. ఇలాంటివన్నీ వదిలేసి మంత్రి సీదిరి అప్పలరాజు మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని