పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్‌ వ్యూహం నేడు ఖరారు

దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది.

Published : 03 Dec 2022 05:08 IST

సోనియాగాంధీ నివాసంలో పార్టీ నేతల భేటీ

దిల్లీ: దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు శనివారం సాయంత్రం ఆ పార్టీ నేతలు దిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో భేటీకానున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురీ, ఉభయసభల్లో పార్టీ చీఫ్‌ విప్‌లు జైరాం రమేశ్‌, కె.సురేశ్‌, సీనియర్‌ నేతలు పి.చిదంబరం, మనీశ్‌ తివారీ తదితరులు హాజరుకానున్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటు సమావేశాలివి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని