కాంగ్రెస్‌ మాజీలకు భాజపా కీలక పదవులు

భారతీయ జనతా పార్టీ పలువురు నేతలకు సంస్థాగతమైన కీలక పదవులను అప్పగించింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ను వీడి కమలదళంలో చేరిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, అదే రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌లకు భాజపా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది.

Published : 03 Dec 2022 05:08 IST

జాతీయ కార్యవర్గంలోకి అమరీందర్‌, సునీల్‌ జాఖడ్‌

దిల్లీ: భారతీయ జనతా పార్టీ పలువురు నేతలకు సంస్థాగతమైన కీలక పదవులను అప్పగించింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ను వీడి కమలదళంలో చేరిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, అదే రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌లకు భాజపా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. మూడు నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీని వీడి  తమ పార్టీలో చేరిన జైవీర్‌ షేర్గిల్‌ను భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. కమలం పార్టీకే చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి స్వతంత్రదేవ్‌ సింగ్‌, ఉత్తరాఖండ్‌ భాజపా మాజీ అధ్యక్షుడు మదన్‌ కౌశిక్‌, ఛత్తీస్‌గఢ్‌ భాజపా మాజీ అధ్యక్షుడు విష్ణుదేవ్‌ సాయి రాణాలతో పాటు పంజాబ్‌కు చెందిన గుర్మిత్‌సింగ్‌ సోధి,     మాజీ మంత్రి మనోరంజన్‌ కాలియా, అమన్‌జ్యోత్‌ కౌర్‌ రామూవాలియాలకు జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు