ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికే గర్జన

రాయలసీమకు ద్రోహం చేసిన వాళ్లే ‘రాయలసీమ గర్జన’ అంటూ సభలు పెడుతున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి మండిపడ్డారు.

Published : 06 Dec 2022 04:25 IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాయలసీమకు ద్రోహం చేసిన వాళ్లే ‘రాయలసీమ గర్జన’ అంటూ సభలు పెడుతున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి మండిపడ్డారు. సీమ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైకాపా వాళ్లు సభలు పెడుతూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం సిగ్గుచేటని సోమవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికి, సంబంధిత మంత్రిత్వశాఖకు ఎందుకు ప్రతిపాదనలు పంపలేదు? సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది వేణుగోపాల్‌.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఆలోచన లేదన్న వ్యాఖ్యల మాటేంటి? కర్నూలులో ఏర్పాటు కావాల్సిన జ్యుడిషియల్‌ అకాడమీని మంగళగిరికి ఎందుకు తరలించారు?’ అని ప్రశ్నించారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ కమిషన్‌ పేరుతో 23 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని