గెలుపెవరిది?

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

Updated : 08 Dec 2022 06:26 IST

గుజరాత్‌, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే

అహ్మదాబాద్‌, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పటిష్ఠ భద్రత నడుమ ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తహతహలాడుతోంది. అక్కడ కమలనాథుల ఘన విజయం లాంఛనమేనని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కాంగ్రెస్‌ రెండో స్థానంలో, ఆప్‌ తృతీయ స్థానంలో నిలుస్తుందన్న అంచనాలున్నాయి. మరోవైపు- హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు ఉంది.

ఐదు రాష్ట్రాల్లో ఆరు అసెంబ్లీ స్థానాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక మైన్‌పురి లోక్‌సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం వెలువడనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌, ఖతౌలీ సహా పదమ్‌పుర్‌ (ఒడిశా), కుఢనీ (బిహార్‌), సర్దార్‌శహర్‌ (రాజస్థాన్‌), భానుప్రతాప్‌పుర్‌ (ఛత్తీస్‌గఢ్‌) అసెంబ్లీ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని