ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించండి

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. వానాకాలం వరి ధాన్యం మొత్తాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు యాసంగి పంటనూ ప్రభుత్వాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం బుధవారం గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేసింది.

Updated : 02 Dec 2021 04:54 IST

గవర్నర్‌కు కాంగ్రెస్‌ బృందం విజ్ఞప్తి

గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తున్నరాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వీహెచ్‌, కోదండరెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. వానాకాలం వరి ధాన్యం మొత్తాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు యాసంగి పంటనూ ప్రభుత్వాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం బుధవారం గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేసింది. అనంతరం శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ..వానాకాలం ధాన్యంతో పాటు యాసంగి పంట కొనుగోలు చేస్తామని చెప్పేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏడు సంవత్సరాలు కేంద్రానికి అన్ని విషయాల్లో మద్దతిచ్చిన కేసీఆర్‌..యాసంగి పంట విషయంలో ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..రైతులు పండించిన పంట ఎందుకు కొనరు? అని ప్రశ్నించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. తెరాస, తెలంగాణ భాజపా నేతలకు చిత్తశుద్ది ఉంటే దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ చేపట్టే ధర్నాకు రావాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ను కలసిన వారిలో కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

డిజిటల్‌ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి: బోసురాజు

పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌ను కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. వారు బుధవారం గాంధీభవన్‌లో సభ్యత్వ నమోదుపై అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశమయ్యారు. డిజిటల్‌ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జీలు హర్కవేణుగోపాల్‌, దీపక్‌ జాన్‌, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు తదితరులు హాజరయ్యారు. ఏఐసీసీ నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బోసురాజు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని