ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేస్తాం

పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించకుండా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు.

Published : 07 Dec 2021 04:45 IST

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

ఈనాడు, దిల్లీ: పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించకుండా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ, గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏడు రాష్ట్రాలు మద్దతు తెలపగా, 15 రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. ఆందోళనలో తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు తాళ్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని