భాజపా ధోరణి ప్రమాదకరం: తెరాస

కుల మతాలు, భాషల పేరు మీద భేదాభిప్రాయాలు తెస్తున్న భాజపా ధోరణి దేశానికి ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. తెలంగాణ గత ఏడున్నర సంవత్సరాలుగా

Published : 27 Jan 2022 04:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: కుల మతాలు, భాషల పేరు మీద భేదాభిప్రాయాలు తెస్తున్న భాజపా ధోరణి దేశానికి ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. తెలంగాణ గత ఏడున్నర సంవత్సరాలుగా అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తోందని, ప్రజల భాగస్వామ్యంతో తెరాస ప్రభుత్వం ప్రగతిపథంలో సాగుతోందని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బండి రమేష్‌, లింగంపల్లి కిషన్‌ రావు,  కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌,ఇతర నేతలు పాల్గొన్నారు. కేకే మాట్లాడుతూ, ‘‘అభివృద్ధి మన కళ్లముందు కనపడుతోంది. ప్రజలు కోరుకుంటున్నవి సాకారం అవుతున్నాయి. కాళేశ్వరం ద్వారా కోటి ఏకరాలకు పైగా నీళ్లు ఇస్తున్నాం. ఈ అభివృద్ధి మరింత విస్తృతం కావాలి. ప్రతీ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. దానికి అనుగుణంగా పనిచేద్దాం’’ అని కేకే అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని