రూ.48 వేల కోట్లు ఏమయ్యాయి?: యనమల

జగన్‌ ప్రభుత్వం మూడేళ్లలో అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం తప్ప సాధించిందేమీ లేదని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.

Published : 27 Mar 2022 05:14 IST

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వం మూడేళ్లలో అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం తప్ప సాధించిందేమీ లేదని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. 2020-21 కాగ్‌ నివేదికను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.48వేల కోట్లకు పైగా సొమ్మును దుర్వినియోగం చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. దానిపై కేంద్రం దర్యాప్తు చేయించాలని కోరారు. మంగళగిరిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కాదని ఇష్టారాజ్యంగా అప్పులు తెస్తున్న ప్రభుత్వం ఆ సొమ్మును ప్రజల కోసం ఖర్చు పెడుతున్నామనడం పచ్చి అబద్ధం. ఏపీ ప్రభుత్వ అప్పులు, ప్రజాధనం దుర్వినియోగంపై కేంద్రం కలగజేసుకోవాలి. ఆర్టికల్‌ 360 ప్రకారం రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.  సొమ్ము దుర్వినియోగంపై ప్రభుత్వం స్పెషల్‌ బిల్స్‌ కింద వాడామని చెబుతోంది. ట్రెజరీ కోడ్‌ను కాదని నిధులు ఇష్టానుసారంగా వినియోగించడానికి వీల్లేదు. ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దీనిపై కేంద్రం స్వతంత్ర సంస్థతో అవసరమైతే సీబీఐతో దర్యాప్తు చేయించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని