వారు 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని కేసీఆర్‌ ఏడేళ్లలో చేశారు

కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్‌లో రూ.17 కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను

Published : 28 May 2022 05:45 IST

 భాజపా, కాంగ్రెస్‌లపై మంత్రి హరీశ్‌ ధ్వజం

మెదక్‌, మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్‌లో రూ.17 కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. మనోహరాబాద్‌ మండలం రామాయపల్లి, కోనాయిపల్లి(పీటీ) గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్‌ షా, మోదీ.. పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై మాట్లాడలేదని విమర్శించారు. తెలంగాణకు ఇస్తామన్న ఐటీఐఆర్‌, రైల్వే లైన్ల ఊసే ఎత్తలేదన్నారు. రైతు డిక్లరేషన్‌ అంటూ తిరుగుతున్న రాహుల్‌గాంధీ.. ముందుగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అమలుచేసి మాట్లాడాలన్నారు.

ఆశా కార్యకర్తల పాత్రే కీలకం: వైద్యారోగ్య శాఖలో ఆశా కార్యకర్తలు పాత్ర కీలకమని.. క్షేత్రస్థాయిలో వారు సరిగా పని చేస్తే ప్రసవాల విషయంలో మార్పు తథ్యమని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మంది ఆశా కార్యకర్తలు ఉన్నారని.. వారిలో 700 మంది పరిధిలో ప్రసవాలకు గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నట్లు తేలిందన్నారు. సాధారణ ప్రసవాలు చేస్తే ఆశా, ఏఎన్‌ఎం, వైద్యులకు అదనంగా ఒక్కో కాన్పునకు రూ.3 వేలు ఇన్సెంటీవ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని