Water Dispute: కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయం.. రాయలసీమకు ఉరితాడే: జీవీ రెడ్డి

కృష్ణా జలాల పంపిణీపై పునఃపరిశీలిస్తామంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాయలసీమకు ఉరితాడు వంటిదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి తెలిపారు.

Published : 07 Oct 2023 22:38 IST

అమరావతి: కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రం ప్రకటనపై తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్పందించారు. కృష్ణా జలాల పంపిణీని పునఃపరిశీలిస్తామంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాయలసీమకు ఉరితాడు లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్‌ దిల్లీలో ఉన్నప్పుడే నోటిఫికేషన్‌ రావడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. కేంద్రం తాజా ప్రకటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులను ఇప్పటికే అప్పగించేశారని విమర్శించారు. కానీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిల సంగతిని మాత్రం వదిలేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు