Harish Rao: సాగునీరు లేదు.. కరెంట్‌ ఎప్పుడొస్తుందో తెలీదు: హరీశ్‌రావు

సాగునీరు లేదని, కరెంట్‌ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు.

Published : 25 Mar 2024 14:55 IST

హైదరాబాద్‌: సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని రైతులే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

‘‘ సాగునీరు లేదు.. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. రాష్ట్రమంతటా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ముఖ్యమంత్రికి మాత్రం ఈ విషయం పట్టడం లేదు. ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారు. అప్పులు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. రజాకార్లను తలపించేలా వాళ్లు ప్రవర్తిస్తున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు.

ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రుణమాఫీపైనే పెడతానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చి 100 పూర్తయినా దీనిపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని