
Punjab Elections: ఒక్క నంబర్‌కు అన్ని కాల్స్ అసాధ్యం.. ఆప్‌ది పచ్చి మోసం: సిద్ధూ
అమృత్‌సర్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈ సారి అధికారం చేపట్టేది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)యేనని.. ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ఈ విషయాన్నే పదే పదే చెబుతూ.. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపికపై ప్రజల అభిప్రాయం కూడా అడిగారు. ‘జనతా చునేగీ అప్నా సీఎం’ పోల్‌లో పాల్గొన్న వారిలో 93 శాతం మంది భగవంత్ మాన్ పేరును ప్రతిపాదించారట. దీంతో కేజ్రీవాల్ ఆయన్నే పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, ఆప్ నిర్వహించిన ఈ పోలింగ్ అంతా మోసమని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపిస్తున్నారు. ప్రజలను ఫూల్స్ చేయడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆప్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
‘‘పంజాబ్ సీఎం అభ్యర్థిపై టెలీపోలింగ్ కోసం ఆప్ పార్టీ ఒక్క నంబర్ మాత్రమే ఇచ్చింది. ఆ నంబర్‌కే 7 లక్షల వాట్సాప్ సందేశాలు, 21 లక్షల వాయిస్ కాల్స్, సందేశాలు వచ్చాయని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి పోలింగ్ కోసం చేసే కాల్స్‌కు కనీసం 15 సెకన్ల సమయం పడుతుంది. అంటే రోజులో 5,760 కాల్స్ మాత్రమే మాట్లాడగలరు. నాలుగు రోజుల్లో 23,040 కాల్స్ మాత్రమే వస్తాయి. కానీ, 21 లక్షల కాల్స్, సందేశాలు రావడం అసంభవం. ఈ గణాంకాలు చాలా గందరగోళంగా, సందేహాత్మకంగా ఉన్నాయి. ఇలాంటి మోసపూరిత పోలింగ్‌తో ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోంది. పంజాబ్ ప్రజలను పూల్స్ చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు’’ అని సిద్ధూ ధ్వజమెత్తారు. ఆప్ నిర్వహించిన ఈ పోలింగ్‌పై తమ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని సిద్ధూ తెలిపారు. కాల్స్ హిస్టరీ పరిశీలించాలని, అందులో మోసం జరిగినట్లు బయటపడితే ఆప్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.