Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. వర్షంలో రోడ్డుపైనే బైఠాయింపు

కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బాటసింగారంలో రెండు పడకగదుల ఇళ్ల పరిశీలనకు వెళ్లాలని భాజపా నిర్ణయించింది.

Updated : 20 Jul 2023 13:22 IST

హైదరాబాద్‌: కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బాటసింగారంలో రెండు పడకగదుల ఇళ్ల పరిశీలనకు వెళ్లాలని భాజపా నిర్ణయించింది. దీనిలో భాగంగా శంషాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు బాటసింగారం బయల్దేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

భాజపా నేత ఈటల రాజేందర్‌ గృహనిర్బంధం

అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ వారికి సూచించారు. అనుమతి లేకుండా భారాస నేతలు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని రఘునందన్‌ ప్రశ్నించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కిషన్‌రెడ్డి, రఘునందన్‌ వర్షంలోనే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వారితో పాటు భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కిషన్‌రెడ్డిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో భాజపా కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని