KTR: ప్రజలెవరూ ఈనెల కరెంటు బిల్లులు కట్టొద్దు: కేటీఆర్‌

లండన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. 

Updated : 20 Jan 2024 13:47 IST

హైదరాబాద్‌: లండన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతోపాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు. 

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ..‘‘రేవంత్‌ వంటి వారిని భారాస తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసింది. 25 ఏళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టికరిపించింది. భారాసను 100 మీటర్ల లోపల పాతిపెట్టడం కాదు.. ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చండి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, భాజపా కలిసిపోతాయి. రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ శిందేగా మారుతారు. ఆయన రక్తమంతా భాజపాదే. ఇక్కడ చోటా మోదీగా మారారు. అదానీ-రేవంత్‌ ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలి. జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దు. కరెంటు బిల్లులను 10-జన్‌పథ్‌లోని సోనియా గాంధీ ఇంటికి పంపాలి. ప్రతి మహిళకు నెలకు రూ.2,500ను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టేది లేదు. 50 రోజుల పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని