KTR: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కండి: పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

జీహెచ్‌ఎంసీ పరిధిలో భారాసకు అపూర్వ విజయం అందించడంలో కీకల పాత్ర పోషించిన కార్పొరేటర్లు, శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 

Updated : 21 Dec 2023 21:43 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో భారాసకు అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్లు, శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కార్పొరేటర్లతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగరంలో భారాస పటిష్టంగా ఉందని, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి నిరాశ పడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని, ఆ హామీలన్నీ నెరవేర్చేలా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ భారాస అని స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారాసను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని