Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!
Panchumarthi Anuradha: ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? అతి చిన్న వయసులోనే మేయర్‌గా ఎలా ఎన్నికయారు?
పంచుమర్తి అనురాధ గురించి ఆసక్తికర విషయాలు
ఇంటర్నెట్‌డెస్క్: వైకాపాకు షాక్ ఇస్తూ, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి, ఉత్సాహంతో ఉన్న తెదేపా శ్రేణుల్లో ఈ విజయం రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ.. రాజకీయ ప్రయాణమూ ఒక సంచలనమే. అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి అతి పిన్న వయసులోనే విజయవాడ మేయర్‌గా తనదైన ముద్రవేశారు.
రాజకీయాలకు సంబంధం లేని కుటుంబం..
పంచుమర్తి అనురాధ కుటుంబానికి రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్‌ఎస్. ఆదాయపన్నుశాఖలో జాయింట్ కమిషనర్‌గా పనిచేసి, పదవీవిరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బదిలీలు జరుగుతుండేవి. అలా ప్రాథమిక విద్య హైదరాబాద్ సెయింట్ ఆన్స్‌లో చదివారు. ఆ తర్వాత ఆయనకు బదిలీ కావడంతో అనురాధ హైస్కూల్, ఇంటర్ విద్యను విజయవాడలో పూర్తి చేశారు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ను గుంటూరు జేకేసీ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్‌తో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఒక పాప. ఆ తర్వాత పంచుమర్తి అనూరాధ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదు.
అతి పిన్న వయసులో అనుకోకుండా మేయర్
పంచుమర్తి అనురాధ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 2000 సంవత్సరంలో విజయవాడ మేయర్ పదవిని మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో ఒక రోజు పేపర్ చదువుతుండగా.. ఆ వార్త అనురాధను ఆకర్షించింది. దీంతో తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. (Panchumarthi Anuradha) అప్పట్లో కార్పొరేటర్, మేయర్‌లకు విడివిడిగా ఎన్నికలు జరిగేవి. దీంతో తెదేపా నుంచి మేయర్‌గా పోటీ చేసేందుకు ఏకంగా 18మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అక్కడ జరిగే చిన్న రాజకీయ చర్యయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై కచ్చితంగా ప్రభావం చూపేదే. పైగా అటు కమ్యూనిస్ట్‌లకు ఇటు కాంగ్రెస్‌కు కూడా బలమైన కేడర్ ఉంది. దీంతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. (Panchumarthi Anuradha) అంతేకాదు, విద్యారంగంపైన కూడా అడిగిన ప్రశ్నలకు అనురాధ చక్కగా సమాధానం ఇవ్వడం, ఉన్నత విద్యావంతురాలు కావడంతో చంద్రబాబు ఆమెవైపే మొగ్గు చూపారు. నేరుగా జరిగిన మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నాగరాణి, కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థి తాడి శకుంతల నుంచి గట్టి పోటీ ఎదురైనా దాదాపు 6,800 పైచిలుకు ఓట్లతో అనురాధ విజయం సాధించారు.
గందరగోళం నుంచి సక్సెస్‌ఫుల్ మేయర్‌గా..
అనురాధ మేయర్‌గా ఎన్నికైనా రాజకీయ అనుభవం లేకపోవడంతో తొలినాళ్లలో ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల నుంచి తరచూ ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యేవి. అసలు మొదటి అయిదు నెలలు ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. దీంతో మేయర్ బాధ్యతలు, విధుల గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని సంకల్పించారు. ట్యూషన్ పెట్టించుకుని మరీ మున్సిపల్ యాక్ట్, నగరానికి, పౌరులకు ఏం చేయాలి? నగరాల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏంటి? ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ఆ సమయంలో కృష్ణ పుష్కరాలు జరగడంతో రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకునేందుకు ఎంతో దోహదపడ్డాయి.
పార్టీ కోసమే..
మేయర్ పదవి పూర్తయిన తర్వాత అనురాధ కొన్నాళ్లపాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉండిపోయారు. అసలు ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె అనుకోలేదు. అయితే, 2007 నుంచి మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుకున్నా, అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు. (Panchumarthi Anuradha) 2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ, ఆ సీటు భాజపాకు వెళ్లిపోవడంతో కుదరలేదు. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నా, దూరం కావడంతో అందుకు ఆసక్తి చూపలేదు. ప్రత్యక్ష రాజకీయాల కన్నా పార్టీకి సేవ చేయాలని సంక్పలించారు. చంద్రబాబు కూడా ఆమెకు పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అలా పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీగా కూడా పని చేశారు . ఆ తర్వాత అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mamata Banerjee: ‘మృతుల సంఖ్యలో వాస్తవమెంత? ’
-
Crime News
Hyderabad: ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు
-
Crime News
Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
-
Sports News
WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్‌కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
-
Politics News
CM KCR: ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
-
India News
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు