BSP: భారాసతో పొత్తుకు మాయావతి అంగీకారం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

లోక్‌సభ ఎన్నికల్లో భారాస (BRS)తో పొత్తుకు బీఎస్పీ (BSP) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకారం తెలిపారు.

Published : 10 Mar 2024 14:15 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భారాస (BRS)తో పొత్తుకు బీఎస్పీ (BSP) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. భారాసతో పొత్తుపై త్వరలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో తదుపరి చర్చలు ఉంటాయని తెలిపారు. ఇటీవల ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని మాయావతి చేసిన వ్యాఖ్యలతో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్‌ అంగీకారం తెలిపినట్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని