Telangana News: పంట రుణాలపై 4శాతం వడ్డీ రాయితీ కల్పించాలి: జీవన్‌రెడ్డి

శాసనమండలి సమావేశాలు కేవలం 4రోజులు మాత్రమే నిర్వహించడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశాల్లో వ్యవసాయ సమస్యలపై స్పష్టత

Updated : 16 Mar 2022 16:06 IST

హైదరాబాద్: శాసనమండలి సమావేశాలు కేవలం 4రోజులు మాత్రమే నిర్వహించడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశాల్లో వ్యవసాయ సమస్యలపై స్పష్టత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జీవన్‌రెడ్డి మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని ప్రచారం చేస్తూ వ్యవసాయ రాయితీలు నిలిపివేశారని ఆరోపించారు. పంట రుణాలపై 4శాతం వడ్డీ రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. రూ.35 వేల వరకే రుణమాఫీ చేసిందన్నారు. మిగిలిన అప్పు మాఫీకి సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో వరి కోతలు మొదలవుతాయని.. ధాన్యం సేకరణపై రైతులు అందోళన చెందుతున్నారని వెల్లడించారు. నిజాం చక్కెర కర్మాగారంపై మండలిలో లేవనెత్తితే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని జీవన్‌ రెడ్డి ఆక్షేపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని