ఎవరితోనైనా స్నేహానికి సిద్ధం: కేకే

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే గర్వకారణమని తెరాస నేత, ఎంపీ కె.కేశవరావు అన్నారు. వ్యవసాయం, మార్కెటింగ్‌, నీటిపారుదల, విద్యుత్‌ రంగాలకు

Published : 31 Jan 2021 01:35 IST

దిల్లీ: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే గర్వకారణమని తెరాస నేత, ఎంపీ కె.కేశవరావు అన్నారు. వ్యవసాయం, మార్కెటింగ్‌, నీటిపారుదల, విద్యుత్‌ రంగాలకు తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఎంపీ నామానాగేశ్వరరావుతో కలిసి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో 18 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయ చట్టాల అంశాన్ని పలు పార్టీల నేతలు లేవనెత్తారు. సమావేశంలో ప్రస్తావించిన అంశాలను ఎంపీలు మీడియాకు వెల్లడించారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు అమలు చేస్తున్నామన్నారు.  పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు కేంద్రానికి మద్దతిస్తామన్నారు. దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అనేది తెరాస విధానం కాదని స్పష్టం చేశారు. ఏం చేసినా తెలంగాణ ప్రయోజనాలకేనని.. రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా నిలిచే పనులను తెరాస ఎప్పటికీ చేయదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా స్నేహం చేసేందుకు సిద్ధమేనని కేకే తెలిపారు. 

నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘రైతు చట్టాలను మేం వ్యతిరేకించాం. దిల్లీలో జనవరి 26న జరిగిన ఘటన సమర్థించదగినది కాదు. అలాగని ఈ ఘటనను సాకుగా చూపి రైతుల సమస్యలను విస్మరించవద్దు’’ అని తెలిపారు.

ఇవీ చదవండి..

దిల్లీ పేలుడు.. ఆ ఉగ్రవాదుల పనేనా?

తెలంగాణకు అదనంగా నిధులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని