Raghurama: రైలును తగులబెట్టి నన్ను హత్య చేయాలని చూశారు: ఎంపీ రఘురామ

భీమవరానికి వెళ్తున్న తనను ఆంధ్ర సరిహద్దులో హత్య చేసేందుకు కుట్ర చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు

Published : 05 Jul 2022 15:39 IST

దిల్లీ: భీమవరానికి వెళ్తున్న తనను ఆంధ్రా సరిహద్దులో హత్య చేసేందుకు కుట్ర చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీగా అధ్యక్షత స్థానంలో ఉండాల్సిన తనను భీమవరం రాకుండా ఏపీ పోలీసులు కుట్ర చేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు డీజీ కార్యాలయం నుంచి వెళ్లిన సమాచారం తన వద్ద ఉందని పేర్కొన్నారు. తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల వ్యవహారంపై కోర్టు వెళ్తానని స్పష్టం చేశారు. సత్తెనపల్లి వద్ద బోగిని తగులబెట్టి తనను హత మార్చాలని చూశారని రఘురామ తీవ్ర ఆరోపణలు చేశారు. 

మరోవైపు రఘురామను ట్రైన్‌లోనే మట్టుబెట్టాలని చూశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీ రఘురామను హత్య చేయటానికి ప్లాన్ చేశారన్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో రఘురామ భీమవరం వచ్చుంటే అదే చివరి రోజు అయ్యేదన్నారు. బేగంపేటలో రైలు దాడి సమాచారం రాగానే.. రైలు దిగి పోయి ప్రాణాలు కాపాడుకున్నారన్నారు. ఇది నిజం కాదని వైకాపా అంటే సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు తెలుస్తాయన్నారు. ప్రధాని ఏపీకి వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారంటే జగన్‌ పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని