‘ఉక్కు’ ప్రైవేటీకరణ నిర్ణయం ఒక్కరోజుది కాదు: సుజనా

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రెండు దశాబ్దాల క్రితమే ...

Published : 06 Feb 2021 01:37 IST

దిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రెండు దశాబ్దాల క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్కు కర్మాగారం విశాఖలోనే ఉంటుందని.. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఆర్థిక విధానాలు, సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇలాంటి నిర్ణయాలు తప్పవని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని హామీలు పదేళ్లలో పూర్తి చేసుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు దానికోసం ముందుకు రావాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి..

అలాంటి అధికారులకు బ్లాక్‌లిస్టే: మంత్రి పెద్దిరెడ్డి విశాఖలో ఉక్కు పరిశ్రమ కార్మికుల ర్యాలీ

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని