Gujarat Eelection 2022: ఇంటి గుట్టు బయటపెట్టిన రవీంద్ర జడేజా భార్య
అత్తింటి వారు తన ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై జామ్‌నగర్ భాజపా అభ్యర్థి రివాబా జడేజా స్పందించారు. ఒక్కొక్కరి సిద్ధాంతాలు ఒక్కోలా ఉండటం వల్ల ఇబ్బందేం లేదన్నారు.
జామ్‌నగర్: ఒకే కుటుంబంలో విభిన్న సిద్ధాంతాలను పాటించేవారు ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని జామ్‌నగర్ భాజపా అభ్యర్థి, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భర్త కుటుంబ సభ్యులు తన ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై ఆమె స్పందించారు. వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. ‘‘ఒకే కుటుంబంలో విభిన్న సిద్ధాంతాలను పాటించేవారు ఉండొచ్చు. ఒక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. దానివల్ల నష్టమేం లేదు.’’ అని రివాబా వ్యాఖ్యానించారు. జామ్‌నగర్ ప్రజలపై తనకు నమ్మకం ఉందని, భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
సీనియర్ కాంగ్రెస్ నేత హరిసింగ్ సోలంకి కుటుంబానికి చెందిన రివాబా జడేజా 2019లో భాజపాలో చేరారు. ఆమె భర్త రవీంద్ర జడేజా కుటుంబీకులంతా కాంగ్రెస్ మద్దతుదారులే. పెద్దలు వీరిద్దరికీ 2016లో వివాహం జరిపించారు. రివాబా భాజపాలో చేరినప్పటికీ ఆమె భర్త కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్‌కే మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ధ్ సిన్హ్ జడేజా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా కోరారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు జడేజా సోదరి, నైనబా జడేజా కూడా కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని కోరడం ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబంలో ఉంటూ రెండు విభిన్న పార్టీలకు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది.
ఇటీవల అనిరుద్ధ్ సిన్హ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కుటుంబం వేరు, పార్టీ వేరు. ఈ రెండింటినీ సరిపోల్చకూడదు. చాలా ఏళ్లుగా నేను కాంగ్రెస్ మద్దతుదారుగా ఉన్నాను.ఇప్పుడు కూడా కాంగ్రెస్‌తోనే ఉంటాను’’ అని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నంత మాత్రాన తన సోదరుడిపై గానీ, అతడి భార్యపై గానీ ప్రేమ ఏమాత్రం తగ్గదని నైనబా జడేజా అన్నారు. తమ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని, ఎవరికి నచ్చిన పనిని వారు చేసుకునే హక్కు ఉందని ఆమె తెలిపారు. దీనిపైనా రివాబా జడేజా స్పందించారు. ఒకే కుటుంబం నుంచి రెండు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం కొత్తేం కాదని, గతంలో చాలా కుటుంబాల్లోనూ జరిగాయని అన్నారు. భర్త రవీంద్ర జడేజా తనకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారని, జామ్నగర ప్రజల అభిమానమే తనను ముందుకు నడిపిస్తోందని ఆమె తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం