Shashi Tharoor: రేవంత్‌ పిలిస్తే గాంధీభవన్‌కు వెళ్లి ప్రచారం చేసుకుంటా: శశిథరూర్‌

అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్‌లో జరుగుతోంది అంతర్గత చర్చేనని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేతో ఆయన పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

Published : 04 Oct 2022 01:13 IST

హైదరాబాద్‌: అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్‌లో జరుగుతోంది అంతర్గత చర్చేనని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేతో ఆయన పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టేందుకు పార్టీలోని ముఖ్యనేతలతో శశిథరూర్‌ భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. పార్టీలో తామంతా ఒక్కటేనని.. తమకు సిద్ధాంతపరంగా వైరుధ్యాలేమీ లేవని చెప్పారు. భాజపాను ఎలా ఎదుర్కోవాలనేదానిపైనే తామంతా చర్చిస్తున్నామన్నారు.  

‘‘పార్టీ ఫండమెంటల్‌ విషయాల్లో నాది, ఖర్గేది ఒకటే స్టాండ్‌. కాంగ్రెస్‌ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తిమంతులనేదే ప్రధాన ప్రశ్న. నేను ఇటీవలే ఖర్గేతో మాట్లాడాను. ఆయన గొప్పనేత. ఖర్గేతో నాకు మంచి సంబంధాలున్నాయి. పారదర్శక ఎన్నికు గాంధీ ఫ్యామిలీ కట్టుబడి ఉంది. తెలంగాణ నాయకులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో జీ23 అనేదే లేదు. ఖర్గేకు, నాకు ఎవరి విజన్‌ వాళ్లకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారు.. కానీ వెళ్లలేకపోయాను. రేవంత్‌ పిలిస్తే తప్పకుండా గాంధీభవన్‌కు వెళ్లి ప్రచారం చేసుకుంటా’’ అని శశిథరూర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని