Lok Sabha Polls: దక్షిణాదిలో అనూహ్య ఫలితాలొస్తాయ్‌.. బొమ్మై ఆసక్తికర వ్యాఖ్యలు

 వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో అనూహ్య ఫలితాలు వస్తాయని భాజపా నేత, మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై అన్నారు.

Updated : 24 Jan 2024 19:48 IST

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) దక్షిణ భారతదేశంలో భాజపాకు అనుకూలమైన, ఆశ్చర్యం కలిగించే ఫలితాలు వస్తాయని అంచనా వేశారు. దేశంలో మోదీ (PM Modi) హవా కొనసాగుతోందని.. యావత్‌ దేశం నరేంద్రమోదీని మరోసారి ప్రధానిగా చూడాలన్న ఆసక్తితో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో భాజపా ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. 

‘విపక్ష కూటమి త్వరలో కూలిపోతుంది’: భాజపా

 కర్ణాటకలో భాజపా 25కి పైగా స్థానాలు గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌పై ఎస్సీ, ఎస్టీ వర్గాలు విరక్తి చెందాయని.. అనేక కులాలను ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో చేర్చినప్పటికీ కోటా శాతం మాత్రం పెంచలేదని ఆక్షేపించారు. హామీల అమలు కోసం సబ్‌ప్లాన్‌ నిధుల్ని మళ్లించడం ద్వారా ఆ వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని