అప్రమత్తంగా లేకుంటే నష్టమే: సోమిరెడ్డి 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. లేకుంటే ఘోరమైన వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బుధవారం నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి

Published : 13 Aug 2020 02:14 IST

నెల్లూరు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. లేకుంటే ఘోరమైన వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బుధవారం నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. లేకుంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు‌, ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న బాధితులకు భోజన వసతి సరిగా లేదని సోమిరెడ్డి ఆరోపించారు. మందులు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఒకసారి కొవిడ్‌ కేంద్రాలకు వెళితే అక్కడి సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటిని ఎందుకు సరిగా వినియోగించుకోవడంలేదని ప్రభుత్వాన్ని సోమిరెడ్డి ప్రశ్నించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని