Politics: దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా కుట్ర: తెదేపా

ఏపీ వ్యాప్తంగా గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్‌ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న

Updated : 13 Nov 2021 16:10 IST

అమరావతి: ఏపీ వ్యాప్తంగా గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్‌ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఎస్‌ఈసీకి ప్రతిపక్ష తెదేపా లేఖ రాసింది. నకిలీ గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేసేందుకు కుట్ర జరుగుతోందని ఫిర్యాదు  చేసింది. బయట వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించేందుకు వైకాపా నేతలు కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొంది. తిరుపతి ఉపఎన్నికల్లో అనుసరించినట్లే ఇక్కడా అనుసరిస్తున్నారని ఆరోపించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని కోరింది. ‘‘ ఓటమి భయంతోనే హింసాత్మక ఘటనలకు వైకాపా కుట్ర చేస్తోంది. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలి’’ అని తెదేపా తన లేఖలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని