Chandra Babu: పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు
ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీయేనని, పేదలకు ఇప్పుడు అందుతున్న దాని కంటే రెట్టింపు సంక్షేమం అందించేలా మేనిఫెస్టో ఉండాలని చంద్రబాబు సూచనలు చేశారు.
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనపై తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనపై పార్టీనేతలతో చంద్రబాబు చర్చించారు. ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీయేనని, పేదలకు ఇప్పుడు అందుతున్న దాని కంటే రెట్టింపు సంక్షేమం అందించేలా మేనిఫెస్టో ఉండాలని సూచనలు చేశారు. మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా మహానాడు ఘనంగా నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించిందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Maharashtra: మహారాష్ట్ర రైతుల కోసం కొత్త పథకం.. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
-
Politics News
Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి..ఆసక్తి రేపుతున్న శివసేన నేతల వ్యాఖ్యలు!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Politics News
Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి