Andhra News: కోర్టు బెయిల్‌ ఇస్తేనే జగన్‌ సీఎంగా ఉన్నారు: నక్కా ఆనంద్‌బాబు

అసెంబ్లీ సాక్షిగా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు ఏపీ సీఎం జగన్‌ ప్రయత్నించారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

Updated : 26 Mar 2022 17:18 IST

అమరావతి: అసెంబ్లీ సాక్షిగా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు ఏపీ సీఎం జగన్‌ ప్రయత్నించారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ఇది న్యాయవ్యవస్థ, రాజ్యాంగాన్ని అవమానించడమే అని చెప్పారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆనంద్‌బాబు మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పులను జగన్‌ అవహేళన చేస్తూ మాట్లాడటం బాధాకరమన్నారు. ఇది అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని చెప్పారు. తప్పులు ఎత్తి చూపితే కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?అని నిలదీశారు. కోర్టు బెయిల్‌ ఇస్తేనే ఇప్పుడు జగన్‌ సీఎంగా ఉన్నారని ఆనంద్‌బాబు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని