TS High Court: తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

నగరంలోని బంజారాహిల్స్‌లో తెరాసకు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాల్‌ చేస్తూ రిటైర్డ్‌ ఉద్యోగి..

Updated : 23 Jun 2022 12:38 IST

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో తెరాసకు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాల్‌ చేస్తూ రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. 

తెరాస హైదరాబాద్‌ కార్యాలయం కోసం 4,935 గజాలు ఇవ్వడం.. అత్యంత ఖరీదైన భూమిని గజం రూ.100కే కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్‌, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని