
Ts News: తెరాస నేతల ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా?: కిషన్‌రెడ్డి
దిల్లీ: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవోపై నిరసన తెలిపేందుకే బండి సంజయ్ దీక్ష చేశారని పేర్కొన్నారు. జీవో 317పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు. జీవో 317 తీసుకురావడం ప్రభుత్వ తొందరపాటు చర్యేనన్నారు. సీఎం కేసీఆర్ మాస్కు పెట్టుకోవడం తాను ఎప్పుడూ చూడలేదని.. మంత్రుల నల్గొండ పర్యటనలో ఎవరూ మాస్కు పెట్టుకోలేదని తెలిపారు. కొవిడ్ నిబంధనలను తెరాస నేతలే పాటించడం లేదని మండిపడ్డారు. ఇవాళ జరిగిన కరీంనగర్ జిల్లా పార్టీ భేటీలోనూ మాస్కులు పెట్టుకోలేదన్నారు. తెరాస నేతల కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెరాస నేతల కొవిడ్ ఉల్లంఘనలపై కేసులు పెడితే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.