AP News: రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే జగన్‌ సీఎం అయ్యేవారా?: చింతా మోహన్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేత చింతా మోహన్‌ ప్రకటించారు. ప్రజా పోరాటంతో ఏర్పాటైన పరిశ్రమ ప్రైవేటీకరణకు ప్రయత్నించడం దారుణమన్నారు....

Updated : 06 Oct 2021 14:19 IST

విశాఖ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేత చింతా మోహన్‌ ప్రకటించారు. ప్రజా పోరాటంతో ఏర్పాటైన పరిశ్రమ ప్రైవేటీకరణకు ప్రయత్నించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 80 లక్షలకు పైగా ఉన్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఉపకార వేతనాలను ఆపారంటూ మండిపడ్డారు. దీపావళి లోపు స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు అంశాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టకి తీసుకెళ్తానని వివరించారు. త్వరలో రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారని చింతా మోహన్‌ తెలిపారు.

‘‘రాజశేఖర్‌రెడ్డి సీఎం కాకపోతే జగన్‌ సీఎం అయ్యేవారా?జగన్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం. విశాఖ ఉక్కు, అమరావతి రైతుల పోరాటానికి రాహుల్‌ గాంధీ సంఘీభావం ప్రకటిస్తారు. 2004లో రాజశేఖర్‌రెడ్డిని సీఎంను చేయడమే రాష్ట్ర సమస్యలన్నింటికీ కారణం. ఆరోజున చేసిన పొరపాటు ఇప్పటికీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది’’ అని చింతా మోహన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని