AP News:  జగన్‌ వర్క్‌ఫ్రం హోమ్‌ ముఖ్యమంత్రి: జనసేన

భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కులేకుండా పోయిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ .....

Updated : 23 Nov 2021 17:14 IST

తిరుపతి: భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కులేకుండా పోయిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఇల్లు కదలరని, ఆయన వర్క్‌ ఫ్రం హోమ్‌ ముఖ్యమంత్రి అని ఆరోపించారు. ఏమాత్రం పరిపాలనా దక్షతలేని వ్యక్తిగా జగన్‌ తయారయ్యారని వ్యాఖ్యానించారు. జల విలయం వల్ల నష్టపోయిన చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించేందుకు నాదెండ్ల మనోహర్‌ తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేసి జిల్లాకు ₹2కోట్లు సాయంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీగా ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలిచేందుకు తాము వచ్చామన్నారు. పార్టీ తరఫున వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, నిత్యావసర సరకుల పంపిణీ వంటి కార్యక్రమాల్ని చేపట్టామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు విడతల పర్యటనలు జరపాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారని తెలిపారు. తొలి విడతగా తాను పర్యటించి వరద నష్టంపై అంచనాలు రూపొందిస్తామని.. రెండో విడతలో పవన్‌ పర్యటిస్తారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకొనే వరకూ తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని