TS News: కేంద్రాన్ని అడగలేని సంజయ్‌ రాష్ట్రంలో దీక్షలా?: నిరంజన్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌, భాజపా కలిసి పని చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు.

Updated : 27 Dec 2021 13:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌, భాజపా కలిసి పని చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓట్లు భాజపా అభ్యర్థికి వేయించలేదా అని నిలదీశారు. కాంగ్రెస్‌ త్వరలోనే భాజపాలో విలీనం కావడం ఖాయమన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్ముతున్నది భాజపా కాదా?ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్మి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నది ఎవరు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కాంగ్రెస్‌ నేతలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు? ధాన్యం విషయంలో భాజపాను కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలదీస్తలేదు. దాదాపు 9లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బండి సంజయ్‌ మోదీని అడగాలి. కేంద్రాన్ని అడగలేని బండి సంజయ్‌ రాష్ట్రంలో దీక్షలు చేస్తున్నారు’’ అని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని