మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబుపై నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌

ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్‌ పరువునష్టం కేసు విచారణ జరిగింది. విచారణకు ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గైర్హాజరయ్యారు. దీంతో వారిద్దరిపై

Updated : 18 Aug 2022 11:51 IST

హైదరాబాద్‌: ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్‌ పరువునష్టం కేసు విచారణ జరిగింది. విచారణకు ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గైర్హాజరయ్యారు. దీంతో వారిద్దరిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణకు హెరిటేజ్‌ ప్రతినిధి సాంబమూర్తి కూడా హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబరు 7కి వాయిదా వేసింది.

కోర్టుకు హాజరైన పలువురు నేతలు

ఎన్నికల నిబంధనల కేసులో తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. లాలాగూడ పీఎస్ లో నమోదైన కేసులో బాల్క సుమన్ కు సమన్లు జారీ అయ్యాయి. అక్టోబరు 8న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో వేర్వేరు కేసుల్లో పలువురు నేతలు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, జగ్గారెడ్డి, కొండా సురేఖ, నాగం జనార్థన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, వేణుగోపాలాచారి, చిన్నారెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని