Ap News: రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు: బాలకృష్ణ

రాయలసీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ తెదేపా నేతలు సదస్సు నిర్వహించారు....

Updated : 17 Oct 2021 17:08 IST

హిందూపురం‌: రాయలసీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ తెదేపా నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. సీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు. సీమ కోసం ఎన్టీఆర్‌ హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొచ్చారని పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆక్షేపించారు. బీటీ ప్రాజెక్టుకు, చెరువులకు, అనంత జిల్లాలోని అన్ని చెరువులకు వెంటనే నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని